విజయసాయిరెడ్డి వర్సెస్ కన్నా లక్ష్మినారాయణ గొడవ పట్ల రకరకాల వార్తలు వినబడుతున్నాయి. మొదటి నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ వైసిపి పార్టీ పట్ల చాలా సానుకూలంగానే ఉంటున్నారు. అంతేకాకుండా రాజ్యసభ వంటివాటిలో బలం అవసరం కావటంతో జగన్ కి కేంద్రం లో కొన్ని పదవుల ఆఫర్లు కూడా అప్పట్లో ఇవ్వటం జరిగింది. జగన్ తీసుకోకపోయినా గాని కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కి ఇండైరెక్టుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
ఇందువల్లే విజయసాయిరెడ్డి నేరుగా బీ.జె.పీ ని టార్గెట్ చేయకుండా వైసీపీ వర్సెస్ కన్నా లక్ష్మినారాయణ అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగిందట. కాగా కన్నా లక్ష్మీనారాయణ పై వ్యాఖ్యలు చేయకముందే ఢిల్లీ బిజెపి పార్టీ పెద్దల దగ్గర ఈ విషయం గురించి చర్చించిన తర్వాత విజయసాయిరెడ్డి విమర్శలు చేసినట్లు సమాచారం.