వయసు నలభైకి చేరుతున్నా పెళ్ళి కావట్లేదా? ఈ ప్రయోజనాలు తెలుసుకోండి.

-

ముఫ్ఫై ఏళ్ళు దాటిపోతున్నా పెళ్ళి చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఈ కన్ఫ్యూజన్ లో పడి నలభై చేరువవుతున్నా పెళ్ళి మాట ఎత్తడం. ఇక ఆ తర్వాత చేసుకుంటారా చేసుకోరా అన్నది వారి నిర్ణయం. రిలేషన్ షిప్ లో సవాలక్ష ఇబ్బందులు ఉంటాయి. అలా అని ఆనందాలు ఉండవా అంటే అదీకాదు. ఉంటాయి. కానీ ఇబ్బందుల కారణంగా మరొకరితో రిలేషన్ షిప్ పంచుకోవడానికి సిద్ధంగా ఉండక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఐతే మీ వయసు నలభై దాటుతున్నా సింగిల్ గా ఉంటున్నట్లయితే ఏమీ బాధపడకండి. అలాగే రిలేషన్ షిప్ వద్దనుకునేవారు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నలభై వరకు సింగిల్ గా ఉంటే ఎన్ని లాభాలుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

రిలేషన్ షిప్ వద్దనుకునేవారు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నలభై వరకు సింగిల్ గా ఉంటే ఎన్ని లాభాలుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఎవరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు

నలభైల్లో సింగిల్ గా ఉంటే ఎవ్వరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే అవకాశం ఉంటుంది. మీకు కావాల్సింది చేయవచ్చు.

ఇష్టమైన పని

మీకిష్టమైన పని చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఏ పనిలో అయితే మీరు ఆనందం పొందుతారో ఆ పని చేసుకోవచ్చు. డబ్బు ఎక్కువ సంపాదించాలనో, ఇతరులు ఏమనుకుంటారో అనో ఇష్టం లేని పనుల్లో భాగం పంచుకోవాల్సిన అవసరం లేదు.

పర్యాటకం

మీకు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవ్వరి అనుమతి లేకుండా వెళ్ళవచ్చు.

మీకిష్టమైన టీవీ ప్రోగ్రామ్ చూడవచ్చు

ఈ అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. మొబైల్ ఏది కావాలంటే అది ఆన్ చేసుకోగలిగే సౌకర్యం ఉన్నా, టీవీ ముందు కూర్చున్నప్పుడు రిమోట్ చేతిలో ఉండడం అనేది అందరికీ వచ్చే అదృష్టం కాదు.

సరైన దృష్టి

మీరు మరింత హేతుబద్ధంగా ఆలోచిస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు.

సమయస్ఫూర్తి

ఈ వయసులో ఎవరూ మీకు ఎదురుచెప్పే అవకాశం పెద్దగా ఉండదు. అందువల్ల మీ సమయస్ఫూర్తిని బాగా వాడుకోవచ్చు.

భాగస్వామి కుటుంబ బాధల నుండి విముక్తి

మీరు సింగిల్ కాబట్టి, భాగస్వాముల కుటుంబాల బాధలు ఉండవు. అనుకుంటాం గానీ ఇరువురి కుటుంబాల్లో ఎప్పుడూ ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది.

మీ జీవిత గమ్యం కోసమే పనిచేయవచ్చు

జీవితంలో ఏదైతే సాధించాలని అనుకున్నారో దానికొరకు మాత్రమే పనిచేసే అదృష్టం ఉంటుంది. చాలామంది జీవితాల్లో ఇది ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version