Today Gold Rate: బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటాయనే విషయం తెలిసిందే. బంగారం, వెండి రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరోసారి తగ్గుతు వస్తాయి. అందుకే పెట్టుబడిదారులు .. వీటి ధరలపై స్పెషల్ ఫోకస్ పెడుతారు. గత రెండ్రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి.
శనివారం కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. కానీ, ఆదివారం తటస్థంగానే కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం .. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా పలుకుతుంది
మరోవైపు.. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. కొన్నిరోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చితే… వెండి ధర రూ.1600 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.60,000లుగా నమోదైంది. గత మూడ్రోజుల్లో వెండి సూమారు రూ.3వేల వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550లు గా నమోదు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా పలుకుతుంది. అలాగే కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 నమోదు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా నమోదైంది. వెండి ధర కిలో రూ. 60,000 వద్ద కొనసాగుతోంది
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. వెండి ధర రూ. 64,200 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది. కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. కిలో వెండి ధర రూ.64,200 లుగా కొనసాగుతోంది.