భారత్ బయోటెక్: నాసల్ వ్యాక్సిన్ వలన ఈ ప్రయోజనాలు ఉంటాయి…!

-

కరోనా వైరస్ మహమ్మారయ్యి ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా వ్యాక్సిన్ వల్ల కరోనాను కట్టడి చేయవచ్చు. భారత్ బయోటెక్ MD డాక్టర్ కృష్ణ ఎల్లా నాసల్ వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూద్దాం..!

మామూలుగా ఇంజెక్ట్ చేసే వ్యాక్సిన్స్ వల్ల కింద ఊపిరితిత్తుల్లోని, పైన ఊపిరితిత్తులు మరియు ముక్కుని ప్రొటెక్ట్ చేయలేమని అంటున్నారు. అలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు అని డాక్టర్ కృష్ణ చెప్పడం జరిగింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆస్పత్రికి వెళ్లే అంత పెద్ద ఇబ్బంది రాదని అన్నారు. అదే విధంగా వ్యాక్సిన్ తీసుకున్నాక రెండు నుంచి మూడు రోజుల పాటు జ్వరం ఉంటుందని అన్నారు.

ఇప్పుడు నాసల్ వ్యాక్సిన్ రానుంది. భారత్ బయోటెక్ కి సంబందించిన ఈ వ్యాక్సిన్ మొదటి ఫేస్ అవుతోంది. భారత్ బయోటెక్ మొట్టమొదటి నాసల్ వ్యాక్సిన్ తీసుకురానుంది. దీనికి సంబంధించిన డేటా కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ రెగ్యులేటర్ మాకు హెల్ప్ చేస్తే మొట్టమొదటి నాసల్ వ్యాక్సిన్ తీసుకు వచ్చిన వాళ్ళం అవుతాము ఇది ఇలా ఉండగా యూఎస్ మరియు చైనాలో కూడా ఈ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ఏం చెప్పారంటే..? ఒక డోస్ నాసల్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ ని బ్లాక్ చేయొచ్చు. అయితే కేవలం పోలియో డ్రాప్స్ లాగ నాలుగు చుక్కలు తీసుకుంటే చాలు. రెండు డ్రాప్స్ ఒక నోస్ట్రయిల్ లో మరొక రెండు డ్రాప్స్ మరో నోస్ట్రయిల్ లో తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version