కరివేపాకుని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూనే ఉంటాం. ప్రతి వంటల్లో కూడా వాడొచ్చు. ఇది మంచి సువాసనని ఇస్తుంది. కరివేపాకు లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మరియు బీ2 ఉంటాయి అలానే కరివేపాకులో ఐరన్ మరియు క్యాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి.
కరివేపాకుని క్యాల్షియం లోపాన్ని తగ్గించే మందులు లో ఉపయోగిస్తూ ఉంటారు. మంచి సువాసన ఇచ్చే కరివేపాకు వలన చాలా లాభాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూద్దాం..!
డయాబెటిస్:
కరివేపాకుని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
గర్భిణీలకు ప్రయోజనం:
కరివేపాకును తినడం వల్ల వికారం, నీరసం లాంటివి తగ్గుతాయి. అలానే వాంతులు లక్షణాలని కూడా ఇది సులువుగా పోగొడుతుంది.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఆరోగ్యానికి:
అజీర్తి, డయేరియా, కాన్స్టిపేషన్ వంటి సమస్యలను కరివేపాకు పోగొడుతుంది. దీనిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. తద్వారా ఈ సమస్యలు తొలగిపోతాయి.
బరువుని తగ్గిస్తుంది:
నిజంగా షాక్ అయ్యారా..? కరివేపాకు వల్ల బరువు కూడా తగ్గవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా ఇది తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం:
కరివేపాకు లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
కరివేపాకు తీసుకోవడం వల్ల ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఎక్కువ ఒత్తిడి ఉన్నవాళ్ళు కరివేపాకుని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
జుట్టు ఎదుగుదల:
కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు కూడా ఎదుగుతుంది ఇది చుండ్రుని కూడా పోగొడుతుంది.