మనం ఎన్నో వంటల్లో ఇంగువని ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పులిహోర వంటి వాటిలో ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ వల్ల కేవలం రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మరి ఇంక ఇంగువ వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడే చూసేయండి. ఇంగువ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఇంగువని ఉపయోగిస్తూనే ఉన్నాం.
తేనె అల్లం కలిపి దానిలో కొద్దిగా ఇంగువను వేసి తీసుకోవడం వల్ల పొడి దగ్గు, శ్వాస నాళము లో వాపు, ఉబ్బసం వంటివి తగ్గిపోతాయి. ఇంగువను డయాబెటిస్ వైద్యంలో కూడా వాడతారు దీనిలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంది. మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయ పడుతుంది. అధిక రక్తపోటు తో బాధపడే వాళ్లకి కూడా ఇంగువ దివ్యౌషధంలా పని చేస్తుంది ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయ పడుతుంది. మైగ్రేన్ తలనొప్పి ఉంటే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే తగ్గుతుంది. పంటి నొప్పి తో బాధ పడేవారు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ప్రతీ రోజు వంటల్లో ఉపయోగించేసి ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి.