షేక్‌పేట తహశీల్దార్‌ వివాదంలో దానం ఎంట్రీ అందుకేనా

-

తెలంగాణలో షేక్‌పేట తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. హైదరబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో పాత గొడవే బదిలీకి కారణం అన్న చర్చ కూడా జరుగుతోంది. గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అవ్వడం దీనిపై మేయర్ సైలెంట్ గా ఉన్నా ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించడంతో తహసీల్దార్ బదిలీ వివాదం పై కొత్త చర్చ నడుస్తుంది.

షేక్‌పేట తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ వ్యవహారంలో హైదరాబాద్‌ మేయర్‌ పాత్ర పై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియోషన్ ఈ బదిలీ అన్యాయం అని ప్రకటించింది. కొందరి నాయకుల ఒత్తిడి ఉన్నట్టు తెలిసిందని.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేసింది. అప్పట్లోనే ఈ వివాదంపై ఒకరిఒకరు పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగిందని భావించారు. ఇప్పుడు గద్వాల్ విజయలక్ష్మి మేయర్ అయిన వెంటనే.. శ్రీనివాస్‌రెడ్డి బదిలీతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియెజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచారు గద్వాల్‌ విజయలక్ష్మి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ బదిలీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే మేయర్‌ మాట్లాడేందుకు నిరాకరించారు. పక్కనే ఉన్న దానం మాత్రం రియాక్ట్‌ అయ్యారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని తహశీల్దార్‌ ఆఫీస్‌కు గద్వాల్ విజయలక్ష్మి వెళ్లారని దానం సమాధానం ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి విషయాన్ని అప్పట్లోనే కలెక్టర్‌ దృష్టికి ఎంపీ కేకే తీసుకెళ్లారని చెప్పారు.

ఎమ్మెల్యే దానం నాగందేర్ మాటలు.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. మేయర్ స్పందించనప్పుడు ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడారని..ఆయన స్పందనతో ఆమెను ఇరికించారని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు సమస్య పెద్దది కావడంతో స్పందిచకపోతే బాగోదాని భావించారో ఏమో.. శ్రీనివాసరెడ్డి బదిలీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మేయర్.

ఈ సందర్భంగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్ వచ్చినప్పటి నుంచి గద్వాల్ విజయలక్ష్మితో పొసగడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బంజరాహిల్స్ డివిజన్‌కు సంబంధించి మొదటి నుంచి రాజకీయంగా గ్యాప్ ఉన్నట్టు సమాచారం. తాజాగా తహశీల్దార్‌ శ్రీనివాసరెడ్డి బదిలీలో మేయర్‌ను వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడినా.. తెలివిగా ఆమెను ఇరికించారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version