ఆడపిల్ల పెళ్లి కోసం చింత వద్దు.. రూ.150 పెట్టుబడిగా పెడితే రూ.31 లక్షలు వస్తాయి..!

-

ప్రతీ ఒక్కరు కూడా పిల్లల చదువు కోసం కానీ లేదంటే పెళ్లిళ్ల కోసం డబ్బులు దాయాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి ఖర్చు అయ్యిపోతు ఉంటాయి. దీనితో ఆ సమయం వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడ పిల్లలకి పెళ్లి చెయ్యాలంటే చాలా కష్టం. మీరు కూడా ఫ్యూచర్ లో ఆడ పిల్లకి పెళ్లి చెయ్యాలా..? అయితే మీరేం కంగారు పడద్దు.

LIC

ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషప్ ఆఫ్ ఇండియా పాలసీని తీసుకొచ్చింది. అదే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ. దీని వలన ఆర్ధిక ఇబ్బంది ఉండదు. మరి ఇక ఈ పాలసీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఏ చింత లేకుండా కూతురికి కన్యాదానం చేసేలా కన్యాదాన్ పాలసీని రూపొందించింది ఎల్ఐసీ.

కూతురు పెళ్లి సమయానికి లక్షల రూపాయలను మనం పొందొచ్చు. అయితే దీనిలో మనం కొన్ని నెలలు పెట్టుబడి పెట్టాలి. కన్యాదాన్ పాలసీలో రోజుకి రూ.150 పెట్టుబడిగా పెడితే నెలకి రూ.4530 అవుతాయి. ఇలా మీరు 22 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయిన తర్వాత మీ చేతికి రూ.31 లక్షలు వస్తాయి.

మీరు కనుక ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ కార్డు, ఇన్‌కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫోటో, మీ కూతురి బర్త్ సర్టిఫికేట్‌ అవసరం అవుతాయి. దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసును లేదా ఎల్ఐసీ ఏజెంట్‌ ద్వారా ఈ పాలసీ తీసుకోచ్చు.

18 నుంచి 50 ఏళ్ల మధ్యలో వున్నవారు దీనికి అర్హులు. మీ కూతురి వయసు కనీసం ఏడాది ఉండాలి. ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. కానీ ప్రీమియాలు 22 ఏళ్లే చెల్లించాలి. ఒకవేళ ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు వస్తాయి. యాక్సిడెంట్ అయితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version