నెలకు రూ. 2వేలు. పొదుపు చేస్తే… రూ. 48లక్షలు రిటర్న్స్‌..ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లానా మజాకా..!!

-

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు.. ఎంత ఎక్కువ శాలరీ వస్తే.. అంత ఎక్కువగానే ఖర్చులు ఉంటాయి. మిగిలేది తక్కువ.. మిగుల్చుకోవాలి అనుకున్నా.. ఆ టైంకు అయిపోతాయి.. అందుకే శాలరీ పడటంతోనే సేవింగ్స్‌కు తీసేయాలి.. ఆ డబ్బు మళ్లీ మన దగ్గరే ఉంటే అయిపోతాయి.. ఇన్సూరెన్స్‌ల ద్వారా డబ్బు. పొదుపు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC)అందిస్తున్న ఓ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా సుమారు అరకోటి రూపాయల రిటర్న్స్ పొందొచ్చు. నెలకు కేవలం రూ.2,000 చొప్పున పొదుపు చేస్తే చాలు. ఎల్ఐసీసేవింగ్స్‌తో పాటు రక్షణ కోసం న్యూ ఎండోమెంట్ పాలసీ (LIC New Endowment Policy) పేరుతో ఈ ప్లాన్ అందిస్తోంది.

LIC

నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, లైఫ్ అష్యూరెన్స్ ప్లాన్. డబ్బు పొదుపు చేయడంతో పాటు రక్షణ కూడా పొందొచ్చని చెబుతోంది ఎల్ఐసీ. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్…
ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌లో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు.
కనీసం 12 ఏళ్ల నుంచి 35 ఏళ్ల టర్మ్ తీసుకోవచ్చు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,00,000. రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడస్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఎంచుకోవచ్చు.
డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో తీసుకునే అవకాశం కూడా ఉంది..
కనీసం నెలకు రూ.5,000, మూడు నెలలకు రూ.15,000, ఆరు నెలలకు రూ.25,000, ఏడాదికి రూ.50,000 చొప్పున తీసుకోవచ్చు.

ఈ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకున్నారంటే.. వార్షిక ప్రీమియం రూ.2,881 + పన్నులు కలిపి చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ రూ.2,49,000 వరకు వస్తాయి. ఇక 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 35 ఏళ్ల టర్మ్‌తో ఈ పాలసీ తీసుకున్నాడంటే… వార్షిక ప్రీమియం రూ.24,391 చెల్లించాలి. అంటే నెలకు రూ.2,079 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ సమయంలో రూ.48 లక్షలకు పైగా రిటర్న్స్ వస్తాయి. ఎల్ఐసీ నుంచి ఏ ప్లాన్ తీసుకోవాలన్నా అధికారిక వెబ్‌సైట్‌లో ఆ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుని చేరండి.
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version