ప్రభాస్ మెనూ మాములుగా లేదుగా… అసలు ఎంత ఖర్చు అయిందో తెలుసా?

-

రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందిన నేలకొరిగారని తెలియగానే సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు ఇక లేరని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ కుటుంబ సభ్యులతో కలసి మొగల్తూరు వచ్చారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో రావడంతో ఆయన్ను చూడటానికి వచ్చిన జన సందోహంతో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు రెబల్ స్టార్ కుటుంబానికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది. స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ తిని వెళ్లమని కోరారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఉద్వేగపూరితంగా సాగింది. ప్రతి ఒక్కరూ కృష్ణంరాజును గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ప్రభాస్​కు జై కొట్టారు. బంధువులకు, అభిమానులకు, గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయించి లక్ష మందికి భోజనం ఏర్పాటు చేశారు ప్రభాస్.

అభిమాన లోకం కడుపునింపేలా నోరూరించే వంటకాలను టన్నుల కొద్దీ చేయించారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన మెనూ ప్రస్తుతం జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ మెనూని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటూ ఉండటం గమనార్హం. ఫుడ్ మెన్యూ, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 2 లక్షల బూరెలు తయారు చేయించారు ప్రభాస్. ఇందుకోసం మొత్తం 4 కోట్లు ఖర్చు పెట్టారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version