RTGS ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వలన కలిగే లాభాలు ఇవే..!

-

మీకు RTGC గురించి తెలుసా..? తెలియకపోతే ఇక్కడ వివరాలు వున్నాయి చూసేయండి.. RTGSలో రోజంతా లావాదేవీలు నిరంతరాయంగా ప్రాసెస్ అవుతాయి. గత డిసెంబర్ 14 నుంచి ఈ సేవలను ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

బ్యాంకు మొబైల్ యాప్స్‌లో లాగిన్ అయిన తరువాత RTGS విధానంలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేయచ్చు. ఎంతో ఈజీగా ఈ విధానం లో డబ్బులని పంపొచ్చు. ఇక దీనికి ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు వుంటుందా…? లేదా..? అనే విషయానికి వస్తే…. ఈ విధానం లో ఇన్‌వర్డ్ ట్రాన్సాక్షన్ల పై ఎలాంటి ఛార్జీలు లేవు.

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండే అవుట్‌ వర్డ్ ట్రాన్సాక్షన్ల పై కేవలం రూ.24.5 వరకు ఛార్జీలు ఉండవచ్చు. రూ.5 లక్షలు దాటిన ట్రాన్సాక్షన్ల పై అయితే రూ.49.5 వరకు ఛార్జీలు పడతాయి. రెమిట్ చేయాల్సిన మొత్తం, డెబిటింగ్ అకౌంట్ నంబర్, లబ్ధిదారుడి బ్యాంకు బ్రాంచి, రిసీవింగ్ బ్రాంచ్ IFSC కోడ్, లబ్ధిదారుడి పేరు, అకౌంట్ నంబరు వంటి వివారాలు ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ అవసరం లేకుండా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రెమిటెన్స్ ప్రారంభించవచ్చు. ట్రాన్సాక్షన్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్లకు చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ చేసే గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితులు ఉండవు. కనుక దీని ద్వారా డబ్బులు పంపించుకోవడం ఉత్తమమైనది.

Read more RELATED
Recommended to you

Latest news