ఎస్‌బీఐ అలర్ట్: ఈ రోజు మూడున్నర గంటలపాటు సేవల నిలిపివేత..!

-

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. ఖాతాదారులు ఈ రోజు సుమారు మూడున్నర గంటలపాటు ఎస్‌బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేరని, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్‌గ్రేడ్ వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్ యాప్ ద్వారా సేవలు కొంత సమయం వరకు నిలిపివేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వినియోగదారులకు హెచ్చరిస్తోంది. బ్యాంకులో ముఖ్యమైన పనులుంటే తొందరగా ముగించుకోవాలని సూచించింది. ఎస్‌బీఐ ట్విట్ ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 1.10 నుంచి సాయంత్రం 5.40 గంటలకు ఎస్‌బీఐ బ్యాంకింగ్, యాప్ సేవలు ఉపయోగించుకోలేరు.

SBI-Yono-App
SBI-Yono-App

ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నందున బ్యాంకు కార్యకలాపాలను నిలిపివేయబడతాయి. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఎస్‌బీఐ అడుగులు వేస్తోందని, ఖాతాదారులు అందరూ ఈ సమయంలో సహకరించాలని కోరింది. డిజిటల్ చెల్లింపులు, దానికి సంబంధిత సౌకర్యాలను వినియోగదారులకు అందించడం ఎస్‌బీఐ ఎప్పుడు ముందుంటుందని, వినియోగదారులు డిజిటల్ చెల్లింపు విషయంలో ఎలాంటి సమస్య లేదని వెల్లడించింది. బ్యాంకు నిర్వహణ, అప్‌గ్రేడ్ పనులను చేయాల్సి ఉంటుందని, ఈ రోజు ఈ పని చేయడం జరుగుతుందని తెలిపింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం యూజర్ బేస్ రూ.13.5 కోట్లు. ఇటీవల విడుదల చేసి బ్యాంకు గణాంకాల ప్రకారం.. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.636 కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించింది. ఇందులోనే సుమారు రూ.64 కోట్ల వరకు యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. ఈ-చెల్లింపుల విషయంలో ఎస్‌బీఐ ఇతర బ్యాంకులను ఓడిస్తోంది. యోనో యాప్ ద్వారా రూ.10 లక్షలకు పైగా వ్యక్తిగత రుణాలు, యాప్ ద్వారా బ్యాంకు సుమారు రూ.15,996 కోట్లు రుణాలు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 మూడవ త్రైమాసికంలో రూ.12,035 కోట్ల విలువైన 7.85 లక్షల విలువైన అగ్రి బంగారు రుణాలను ఎస్‌బీఐ ఆమోదించింది. దీంతోపాటుగా రైతులకు రుణాలను కూడా అందజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news