మన చుట్టుపక్కల కనిపించే కూరగాయల్లో మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్నే. తెలియాల్సినవి చాలా ఉన్నాయి. మీ ఆహారంలో రంగు రంగుల కూరగాయలు చేర్చుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుందని మీకు తెలుసు. అలాంటి రంగు రంగుల కూరగాయల్లో మునక్కాయ కూడా ఒకటి.
మునగకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కాల్షియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
మునగకాయ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
గాయాల మంటను తగ్గిస్తుంది
గాయాల కారణంగా మంట పుడుతుంటే మునగకాయ తినడం వల్ల దాన్నుండి ఉపశమనం పొందవచ్చు. గాయాల బారిన పడ్డవారు మునగకాయ తినడం మంచిది.
చక్కెర నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మునగకాయ చాలా సాయపడుతుంది. దీనివల్ల గుండెకి సంబంధించిన ఇబ్బందులూ తలెత్తవు.
కంటిచూపు
కంటిచూపు మసకబారుతుంటే మునగాకు తినండి. మసకబారుతున్న కంటిచూపుని తిరిగి తీసుకురావడంలో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కడుపు సంబంధ సమస్యలు
అజీర్తి, గ్యాస్, మలబద్దకం మొదలైన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మునగకాయని మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ ఇబ్బందులన్నింటికీ మంచి పరిష్కారంగా మునగకాయ పనిచేస్తుంది.
తలనొప్పి
మునగ ఆకులను కూరగా చేసుకుని ఆహారంగా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
కిడ్నీలో రాళ్ళు
కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు మునగకాయ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. మునగకాయలతో చేసిన సూప్ తాగినా బాగుంటుంది. లేదా మునగకి సంబంధం ఉన్న కషాయాలను తాగినా మంచి ఫలితం ఉంటుంది.
మొత్తానికి మునగకాయలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.