మీరు అదిరిపోయే రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే ఈ తప్పక మీరు ఈ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తీసుకోవాలి. ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మీరు తక్కువ ప్రీమియంతో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే సంస్థ ఒకటుంది.
పోస్టాఫీస్ తరుపున ఈ సంస్థ కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తూ ఉటుంది. అయితే ఇది ఆరు రకాల ఇన్సూరెన్స్ పథకాలు ఇస్తోంది. వీటిల్లో గ్రామ్ సుమంగల్ స్కీమ్ కూడా ఒకటి. దీని వలన మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. గ్రామ్ సుమంగల్ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఇది మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఈ పాలసీ వలన ఎన్నో లాభాలు పొందొచ్చు. గరిష్టంగా రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. నిర్ణీత కాల వ్యవధుల్లో పాలసీదారులకు డబ్బులు వస్తాయి. అదే పాలసీదారుడు మరణించినట్టైతే నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి. దానితో పాటు బోనస్ కూడా వస్తుంది.
మీకు 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లభిస్తాయి. ఇలా మొత్తం డబ్బులు వచ్చేస్తాయి. 25 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి 20 ఏళ్ల కాల పరిమితితో రూ.7 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే మొత్తంగా రూ.14 లక్షలు లభిస్తాయి. మీరు దీని కోసం ప్రతీ నెల చెల్లిస్తే చాలు.