ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే వారిద్దరికీ నచ్చిన ఏదో ఒక టాపిక్ వాళ్ళని మాట్లాడుకునేలా చేస్తుందనే అర్థం. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి అది నచ్చకపోయినా ఆ సంభాషణ కట్ అవడమో లేదా మరో టాపిక్ లోకి మారిపోవడమో జరుగుతుంది. ఐతే ఇద్దరి మధ్య బంధం నిలబడడానికి చాలా కారణాలుంటాయి. అలాగే విడిపోవడానికి చాలా కారణాలుంటాయి. బంధంలో ఉన్నన్ని రోజులు ఏ సమస్యా లేదు. విడిపోతేనే పెద్ద సమస్య. అప్పటి వరకూ ఒకలా ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. దానివల్ల బాధ కలుగుతుంటుంది. అలా బాధ పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం.
మిమ్మల్ని విడిచివెళ్ళిన వారిని మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. వారిని నేను మార్చగలననే నమ్మకం అంత మంచిది కాదు.
ఎవరికి పడితే వారికి ఏది పడితే అది చేసేయాలని చూడవద్దు. ప్రతీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి.
ఎప్పుడూ ఎదుటివారి కోసం బ్రతకవద్దు. ప్రేమించాం అని చెప్పి వారే మీ జీవితం అనుకోవద్దు. జీవితంలో ప్రేమ ఒక్కటే భాగం కాదు.
ప్రేమలో ఓడిపోయాక మళ్ళీ ప్రేమని వెతకండి. ఎప్పుడో ఒకరోజు మీకు కావాల్సిన ప్రేమ దొరుకుతుంది. దానికన్నా ముందు మీరు మీ ప్రేమని పంచండి.
ఎదుటివారిని అంత ఈజీగా నమ్మేయవద్దు.
వాళ్ళని నమ్మిన కారణంగా మీ జీవితంలో జరగబోయే ఏ పరిణామానికైనా మీరే బాధ్యులవుతారని గుర్తుంచుకోండి. అలా అని ఎవ్వర్నీ నమ్మకుండా ఉండమని కాదు. అంత తొందరగా నమ్మేసి, మీ గురించి అన్ని విషయాలు చెప్పడం మంచిది కాదని చెప్పడమే.
ఎక్కువ కష్టపడితే విజయం వచ్చేస్తుందన్న భ్రమలో ఉండవద్దు. కొన్ని సార్లు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం లేకుండా ఇంకా కష్టపడుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఒకరితో రిలేషన్షిప్ బ్రేక్ అయిందని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు. మీకింకా బెటర్ ఛాన్స్ ఉందేమో!
విడిపోయిన తర్వాత పగ ప్రతీకారం అంటూ తిరగకండి. నిజమైన ప్రతీకారం అంటే ఎలాంటి ప్రతీకారం ఉండకపోవడమే.