అదిరే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో రూ.15 లక్షలు పొందొచ్చు..!

-

పోస్టాఫీస్‌ మనకి ఎన్నో రకాల సేవలని ఇస్తుంది. వీటి వలన చాలా ప్రయోజనాలను పొందొచ్చు. అలానే దీనిలో చాలా మంది తమ యొక్క డబ్బులని దాచుకుంటారు వుంటారు. దీనిలో డబ్బులు పెడితే ఏ రిస్క్ ఉండదు. అందుకే ఎక్కువ మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే పోస్టాఫీస్‌లో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి వలన మంచిగా లాభాలని పొందొచ్చు.

 

వీటిల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో చేరడం వలన రూ.15 లక్షలు పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. రూ.1000తో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవొచ్చు.

మాక్సిమం రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇందులో డబ్బులు పెట్టచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే చార్జెస్ పడతాయి.

ఇది ఇలా ఉంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ పథకంలో పెట్టిన డబ్బులపై పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు కనుక ఈ స్కీమ్ నుండి రూ.15 లక్షలు పొందాలని అనుకుంటే అప్పుడు రూ.10.5 లక్షలు ఇన్వెస్ట్ చెయ్యాలి. మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. కావాలంటే మూడు ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version