వివాహం అయిన మహిళలు నుదిటి మీద సింధూరాన్ని ధరిస్తారు. అయితే దీనిని పురాతన నుంచి కూడా అనుసరిస్తూనే ఉన్నారు. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది.. నుదుటి మీద సింధూరం పెళ్లైన మహిళలు ఎందుకు ధరించాలి అని అయితే హిందూ మతం సింధురాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అయితే పెళ్లైన మహిళలు సింధూరాన్ని నుదుటి మీద ధరిస్తే భర్త ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారని నమ్మకం. అయితే అది మేకప్ లో భాగమని అనుకుంటే పొరపాటు. అలానే సింధూరాన్ని పూజ లో కూడా వాడుతూ ఉంటాము. సింధూరం ని కుజుడు అని అంటారు. అందుకే వినాయకుడు నుంచి హనుమంతుడు దాకా పూజలు చేస్తూ ఉంటారు.
అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా జీవితంలో అనేక బాధలను తొలగిస్తుంది అని అంటారు. అయితే దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు చూసేద్దాం.
ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ సింధూరం బాగా ఉపయోగపడుతుంది. హనుమంతుడికి సింధూరం లో జాస్మిన్ ఆయిల్ లేదా ఛమోలీ ఆయిల్ వేసి ఐదు మంగళవారాలు మరియు ఐదు శనివారాలు పూజిస్తే సమస్యలు తొలగిపోతాయి.
అలాగే ఏదైనా ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తే అనేక రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు అయితే వాళ్ల మీద కొద్దిగా సింధూరం నీళ్లు జల్లడం వల్ల క్రమంగా వాళ్ళు ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి వీలవుతుంది.
అదే ఆర్థిక బాధలు ఉంటే సింధూరాన్ని కొబ్బరికాయ మీద ఒక గుడ్డలో వేసి కట్టి దానిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
అలానే ఇంటి ద్వారం మీద కొద్దిగా సింధూరం లో నూనె వేసి పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా తప్పకుండా 40 రోజులపాటు చేయండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి.