లాక్‌డౌన్‌ మీద ఏపీ సీఎం కీలక వ్యాఖలు ! 

-

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, కరోనా వాక్సినేషన్‌ పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం వైయస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ నియంత్రణకు మనకు ఉన్న అస్త్రం వాక్సిన్‌ అని, అందుకే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. అదే విధంగా టెస్టులు, కోవిడ్‌ ఆస్పత్రులను సన్నద్ధం చేయాలన్నారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తప్పనిసరిగా వాక్సిన్‌ ఇవ్వాలన్న అయన ఎక్కడా కోవిడ్‌ వాక్సిన్‌ను వృథా చేయొద్దని అన్నారు. కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

jagan
jagan

కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలందించాలని, ఐసొలేషన్‌కు ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ ఉండాలని, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక లాక్ డౌన్ గురించి ఆయన మాట్లాడుతూ ‘ఇది కష్టకాలం కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి. లాక్‌డౌన్‌ విధించకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదు. గత ఏడాది చూశాం. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు’ అని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news