పెద్దబాల శిక్షని ఎన్సైక్లోపెడియా అనవచ్చు. పెద్ద బాలశిక్ష పుస్తకం మొత్తం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి తెలుగు వారు కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలం లో ఆంధ్ర దేశంలో పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. అయితే అప్పట్లో పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని ఈ పెద్ద బాలశిక్ష తో ప్రారంభించే వారు. పాఠ్య పుస్తకాల లో భాగంగా ఈ పెద్ద బాలశిక్ష ఉందంటే దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకొని తీరాలి.
తెలుగు ఎన్సైక్లోపెడియా అనే ఈ పెద్ద బాలశిక్ష మొదట్లో అనేక మంది చదివినా ఆంగ్ల విద్యా ప్రవేశం వలన ఈ పుస్తకం కొంచెం ఆదరణ తగ్గిపోయింది కానీ ఇటీవలే మళ్లీ వెలుగులోకి రావడం విశేషం. తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా దీనిని చెప్పుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు కనుక పిల్లలకి ఈ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్తే వాళ్లకి మంచి విలువలు, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. భాషపై పట్టు కూడా ఏర్పడుతుంది.