బెంగాల్ ఫైల్స్ : వీరుల మ‌ట్టి నుంచి నియంత‌ల పుట్టుక

-

బెంగాల్లో ఇప్పుడేమ‌వుతోంది. ఆ రోజు ఏమ‌యింది. మ‌మ‌త ఆ రోజు పోటీ చేసి ఓడిపోయిన దాఖ‌లాలు నుంచి గెలిచి వ‌చ్చిన రోజు వ‌ర‌కూ ప‌రిణామాలు ఎలా మారిపోయాయి. దేశాన్ని న‌డిపిస్తున్న వ్య‌క్తులు చేయాల్సిన ప‌నులేంటి.. చేస్తున్న ప‌నులేంటి?
ఇవే ఇప్పుడు పెద్ద పెద్ద ప్ర‌శ్న‌ల‌కు తావిస్తున్నాయి.

మెథడ్‌ : ఉత్పాతాన్ని ప్రేమిస్తూ….
మోటివ్ : ముందున్న భ‌యాల‌ను స్వాగ‌తిస్తూ..

ఖ‌ద్దరు అల్లిక‌లు..ఖాకీ చొక్కాలు..రెండూ ప‌నిచేసి..ఒక నేల‌కు రక్తాన్ని అల‌వాటు చేశాయి..నేల దాహాలు మ‌నుషుల మ‌ర‌ణాల‌తో తుల్యం అవుతాయ‌ని భావించేయి .. అలాంటి చోటు నుంచి నందిగ్రామ్ అనే చోటు నుంచి మ‌ళ్లీ నాయ‌కులు ..దేవులాట మొద‌లుపెట్టారు..అయినా మ‌మ‌త ఓ సంద‌ర్భంలో ఓడిపోయారు..ఓడిపోవ‌డంలో ఆవ‌శ్య‌క‌త ఉంది..గెల‌వ‌డంలో ఉత్పాతం ఉంది..ఉత్పాతాన్ని మ‌నం ప్రేమించడంలో ముందుంటాం .. అదేవిధంగా దేశానికో నియంత‌ను అందించేందుకు సిద్ధంగా ఉంటున్నాం.. కొన్ని ప్రాంతీయ శ‌క్తు ల కూడిక‌ల‌తో జాతీయ వాదం వ‌ర్థిల్లుతుంద‌ని రాస్తున్నారే! మంచిది! వీరూ ఆ జాతీయ పార్టీల‌కు ఒక‌నాటి ఏజెంట్లే క‌దా!అన్న‌ది గుర్తు పెట్టుకుని మాట్లాడండి.. ఈ మాట్లా డే శ‌క్తులు ఏవీ ప్ర‌త్యామ్నాయం కాదు..అటు ఆంధ్రా ఇటు తెలంగాణ దేశానికి స‌మ‌ర్థ నాయ‌కుల‌ను అందించ‌డం లేదు..క‌నుక ఎవ‌రు గెలిస్తే వారి పాట అందుకుని మురిసి పోతున్నాయి ఇప్పుడీ నియంత రేపు ప్ర‌ధాని కాగ‌లరు.. అన్న‌ది వెరీ హైపో థిటిక‌ల్.. రాగల కాలంలో కాగ‌ల కార్యాలను వ‌ద్ద‌నుకోవ‌డంలో ఏహ్య‌త అన్న‌ది ఒక‌టి దాగి ఉంది..

సౌంద‌ర్యాల‌కు ఆన‌వాలు
అయిన న‌గ‌రంలో
సౌశీల్య‌త‌ల‌ను చూడ‌డం
లేదా చూడాల‌న్న త‌ప‌న‌కు
ప్రాధాన్యం ఇవ్వడం త‌ప్పు

ర‌వీంద్రుడు న‌డ‌యాడిన నేలలో ఆ వేష‌ధార‌ణ‌లు చెల్ల‌వు నేరంగా తోచింది నేల నుంచి వీరులు వీరుల నుంచి వీర మ‌ర‌ణాలు మ ర‌ణాల నుంచి విడువ‌డిన శిక్షా స్మృతులు అన్నీ అన్నీ పోగేసుకున్నాక దేశానికిక కొత్త నియంత రాక నిర్థార‌ణ‌కు తూగింది మన జీవితాల్లో ప‌ట్టి ప‌ట్టి తెచ్చిన ఆనందాలు ఏవీ ఈ నాయ‌కులు ఇవ్వ‌రు కానీ త‌మ త‌మ స్వ ప్రయోజ‌నాల‌కు కొన్ని రంగులు అద్ద‌కా న్ని మాత్రం ఇష్ట‌ప‌డ‌తారు అలాంటి జ‌రీ నే త చీర‌ల్లో క‌ళ క‌ళ‌లాడితే మ‌మ‌త మ‌రియు అనురాగం వ‌ర్థిల్లును అని అనుకోవ‌డం లో ఏమయినా ఆంత‌ర్యం ఉందా? లేదా మోడీ లాంటి మ‌రో నియంత దేశానికి అవ‌ సరం మ‌నం అంతా స్వాగ‌తిస్తున్నామా.. వీరుల నుంచి కోరుకున్న‌వి వీరుల నుంచి పొంది ఉన్న‌వి కోల్ క‌తా దారుల్లో జీవ‌స‌మాధి అయి ఉన్నాయి వీటిని త‌ట్టి లేపండి అది బాధ్య‌త మ‌తాల పుట్టుక‌లో క‌ల‌హాన్ని కులాల కూడిక‌ల్లో క‌ల‌హాన్ని రాజేసిన మ‌ నుషులే దేశానికి కావాల‌నుకున్న‌ప్పుడు బీజేపీ లాంటి పార్టీ మ‌రొక‌టి పుట్టుక సా ధ్యంలోనే ఉంటుంది చ‌దివే ల‌లితా స‌హ‌స్రం అంద‌రి మంచినే కోరుకొమ్మ‌ని చెబుతుం ది.. మ‌ళ్లీ హిందూ సెక్యుల‌రిజం ఏంటి ? వింత ప‌దం ఒక‌టి నెత్తిన కూర్చొంది దేశానికి మ‌తాలు అవ‌స‌రం క‌న్నా మ‌నుషులు మాన‌వ త్వంతో నిండిన‌ మ‌నుషులు కావాలి.. కానీ ఎందుక‌ని ఈ జాడ్యాలు పోవ‌డం లేదు అని! సందిగ్ధ‌త‌ల నుంచి రాస్తున్నానొక
బెంగాల్ ఫైల్స్. నిజంగా చెప్పాలంటే తృణముల్ కాంగ్రెస్ పార్టీది ఓ అస‌మ‌ర్థ ప్ర‌యాణం : ..కేదారాల సృష్టి వీరికి సాధ్యం కాదు ..
అన్న‌ది ఓ విమ‌ర్శ.

మ‌నుషులే అంతా! మ‌ట్టిని సార‌వంతం చేశాక పుట్టుకను సారవంతం చేసుకోలేని మ‌నుషులే అంతా! దేశానికి స‌మ‌ర్థత అన్న‌ది లేదు న‌డిపించే వాడిలో ఆ స‌మ‌ర్థ‌త లేదు న‌డిచే వారిలో ఆ స‌మ‌ర్థ‌త ఉందో లేదో తెలియ‌దు..బెంగాలీ దేశాన పుట్టిన కోయి ల‌లు ఈ దేశాన్ని న‌డిపిస్తాయి అని కొంద‌రు ముందే ఓ ఊహ‌ను నెత్తిన కుమ్మ‌రిస్తున్నారు .. కాకుల‌న్నీ ఓ చోట చేరి చేస్తున్న క‌చేరీ ఇది..ఈ స్వ‌రాల‌ను ర‌ద్దు చేయం డి.. మ‌న ద‌గ్గ‌ర దౌర్భాగ్యం ఉంది.. మ‌నం నెత్తిన నియంత‌ల‌ను వారి పోక‌డ‌ల‌ను తెలియ‌కుండా నే హ‌క్కుగా స్వీక‌రించి ఊరేగిస్తున్నాం.. అవి దిష్టి బొమ్మ‌ల్లాంటివి.. పంట పొలాల్లో ఉం డాల్సిందే త‌ప్ప స‌స్య కేదారాల సృష్టికి అవి ప‌నికిరావు. కానీ మ‌నం కొన్ని సార్లు క‌ మ్యూనిస్టు శ‌క్తుల‌ను కొన్ని సార్లు మ‌త‌తత్వ శ‌క్తుల‌ను ఏక కాలంలో నెత్తిన పెట్టు కుం టున్నాం.. క‌మ్యూనిస్టులు మంచోళ్లా మోడీ మంచోడా లేదా మ‌మ‌తా అను నాయ‌కు రాలు మంచి వారా అన్న‌ది తేల్చ‌మంటే హత్యా రాజ‌కీయాల‌కు ఏ పార్టీ అతీతం అయి ఉందో చెబితే అప్పుడు తేల్చి చెబుతాను అని అంటాను. సుదీర్ఘ కాలాన దేశానికి అ న్ని రాజ‌కీయ పార్టీలు త‌మ త‌మ జాడ్యాల‌ను అంటించి పోతున్నాయి.. అందుకు మ‌మ‌త మిన‌హాయింపు కాదు అలానే ఇంకా ఇంకొన్ని రాజ‌కీయ శ‌క్తులు కూడా.. ఎ వ్వ‌రూ గొప్ప కాదు ఎవ్వ‌రిలో నూ నిజాయితీ లేదు కానీ మ‌నం కంటికి క‌నిపించిన మేర ఊహ ప్ర‌స‌రించినంత మేర శ‌క్తుల‌ను న‌మ్ముతూ పోతున్నాం. లేదా న‌మ్మి మో స‌పోతున్నాం..

మ‌ట్టి నుంచి మ‌నిషి వ‌ర‌కూ
జీవం నుంచి ఆత్మ వ‌ర‌కూ
దేహం నుంచి దేశం వ‌ర‌కూ

ఈ మృత్తిక‌లు వీరుల‌ను స్మ‌రిస్తాయి..అవును నిద్రాణంలో ఉన్నా అవి చేసే ప‌ని ఇదే ..అని చ‌దివేను..కానీ జీవ‌చ్ఛవాల‌ను త‌యారు చేసే కార్ఖానా ఈ దేశం అని నిర్థార‌ణ అయితే ఏం చేయ‌ను? అందుకు నియంత‌ల త‌యారీ ఒక ప్రాతిప‌దిక అవుతోంది.. మ‌ నుషుల‌కు దేశానికి మ‌ధ్య ఉన్న అగాధం చాలా పెద్ద‌ది దానిని ఏ నాయ‌కుడూ లేదా నాయ‌కురాలూ ఎన్నటికీ పూడ్చ‌లేరు.. సోనియా అయినా మ‌మ‌త అయినా లేదా మ‌రొక‌రు అయినా మోడి అయినా యోగి అయినా ఎవ్వ‌ర‌యినా కార్పొరేట్ శక్తుల పెట్టుబ‌డు ల‌ను త‌మ ఖాతాల్లో వేసుకుని తమ త‌మ గ‌మ‌న రీతుల‌ను ముందుకు సాగించేవా రే! ఇందుకు క‌మ్యూనిస్టులూ ఏం మిన‌హాయింపు కాదు.. ప‌నికిమాలిన రాత‌ల‌ను వ‌ల్లెవేసే మీడియా కూడా అందుకు మిన‌హాయింపు కాదు. మన‌లోనే దారిద్ర్యం ఉంది అందుకు మ‌నం ప్ర‌క్షాళ‌న ఎంచుకు ని కొత్త దారుల వెంట ప్ర‌యాణిం చాలి కానీ జ‌బ్బు లు అందుకు ప్ర‌తిబంధకం అవుతు న్నాయి .. ఈ నాయ‌కులు అంటించి న జ‌బ్బులు అందుకు కార‌ణం అవుతున్నాయి .. ప్రియ జ‌నులారా! ఇది మీ ప్రాప్తం.. వ‌ద్ద‌ను కోవ‌డంతో ముగిసిపోదు.. కాద‌నుకో వ‌డంలో ఔచిత్యం లేదు..అర్థం సంద‌ర్భం .. అవ‌స‌రం ఈ మూడు న‌డిపిస్తాయ‌ని ఓ పీఆర్ ఇంజినీరు చెప్పారు..అవును అర్థం దారిద్యంలో ఉంది భావం అందుకు అనుగుణంగా ఉంది,..సంద‌ర్భం కాలానికి అను గుణంగా ఉందో లేదో.. అవ‌స‌రం ఎదగాల‌న్న అవ‌స‌రం ప్ర‌తి నాయ‌కుడికీ ఉంది..వ‌ర్థిల్లు భార‌త‌మా వ‌ర్థిల్లు……..

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version