కరోనా వైరస్ ఏ విధంగా విస్తరిస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ఇక అది వ్యాపించే విధానం కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. దాని రూపం అర్ధం కాక అది వ్యాపించే విధానం అర్ధం కాక ప్రజలు ఇప్పుడు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. మొబైల్ నుంచి, న్యూస్ పేపర్ నుంచి కూరగాయల నుంచి కరోనా వస్తుంది అంటున్నారు.
ఈ తరుణంలో బెంగాల్ సర్కార్… కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ ఆధారంగా బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆస్పత్రుల్లో వెళ్ళాక ముందే డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, రోగులు తమ మొబైల్ ఫోన్లను బయటే అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎవరూ ఆసుపత్రుల లోపలికి ఫోన్లు తీసుకువెళ్లరాదని, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో తమ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కోర్ట్. ఆసుపత్రుల్లో అపరిశుభ్రతతో సహా ప్రభుత్వ వైఫల్యాలు రికార్డ్ చేస్తున్నందుకే మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదని బిజెపి ఆరోపణలు చేస్తుంది. కోల్‌కతా శ్మశానాల్లో 3 రోజులుగా ఏకధాటిగా శవాలను తగలబెడుతున్నారని బిజెపి ఆరోపించింది.