విజయసాయిరెడ్డి ధైర్యం వెనక బీజేపీ నేత!

-

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో.. అక్కడి రాజకీయాలు కూడా అదే రేంజ్ లో వేడెక్కుతున్నాయి. ఎవరివి సత్యారోపణలు, ఎవరివి అసత్య ఆరోపణలు అనే సంగతి ప్రస్తుతం కాణిపాకం వినాయకుడికి వదిలేస్తే… విజయసాయి – కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబందించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తుంది. అందులో అతిముఖ్యమైన విశ్వసనీయ సమాచారాల్లో ఒకటి… విజయసాయి రెడ్డి మాటల వెనక ఒక సీనియర్ బీజేపీ నేత ఉన్నారని!

అవును… వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల వ్యవాహారం విషయంలో విజయసాయి అంత ధైర్య్యంగా.. అంత పక్కా సమాచారం ఉందన్నట్లుగా మాట్లాడటం వెనక జీవీఎల్ నరసింహారావు ఉన్నారనేది ఈ కొత్త సమాచారం! ఏపీ బీజేపీలో జీవీఎల్ వర్గం ఒకటి కాగా.. క‌న్నా వర్గం మరొకటి అనే విషయం రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే! ఇందులో భాగంగానే జీవీల్ వర్గమైన సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజులు ఈ విషయంపై నోరు మెదపడం లేదని అంటున్నారు. ఇదే క్రమంలో కన్నా వర్గంలో సుజనా చౌదరి, పురంధేశ్వరి వంటి బడా నేతలు ఉండటంతో… విజయసాయి వారిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది!

ఏపీలో బీజేపీ విషయంలో పార్టీకి ఏ చిన్న విషయం వచ్చినా ఫైరయిపోయేవారు వీర్రాజు.. ఇదే సమయంలో టీవీ డిబేట్స్ లో తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ… అన్ని విషయాలపైనా సెంట్రల్ లో స్పందించేవారు జీవీఎల్! అలాంటిది… ఏపీలో ఈ స్థాయిలో కన్నాపై విమర్శల వర్షాలు కురుస్తుంటే… జీవీఎల్ మౌనంగా ఉండటమే దీనికి సాక్ష్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈలెక్కన చూసుకుంటే… విజయసాయికి ఉన్న అజ్ఞాత స్నేహితుడు.. కన్నాకున్న అజ్ఞాత శతౄవే… సాయి రెడ్డి మాటల వెనక ఉన్న ధైర్యం అని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ లెక్కన ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన అయితే మాత్రం కన్న ఇరుక్కుంటారని అభిప్రాయపడుతున్నారు! ఇంతకూ ఈ కాణిపాకం పై ఒట్టు అనే ఎపీసోడ్ ఎప్పుడు ముగుస్తుందో.. ఎవరు బలవుతారో అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version