బెస్ట్ మదర్ అనాలి అంటే మీలో ఇవి కచ్చితంగా ఉండాలి…!

-

సాధారణంగా అందరి మహిళలకు బెస్ట్ మదర్ అనిపించుకోవాలని ఉంటుంది. కానీ చిన్న చిన్న పొరపాట్లు, నడవడిక వల్ల అనిపించుకో లేక పోతారు. అయితే మీరు బెస్ట్ మదర్ అని అనిపించుకోవాలి అని అనుకుంటున్నారా…? అయితే ఇవి మీలో ఉండేటట్లు చూసుకోండి మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

మీ మీద శ్రద్ధ తీసుకోండి:

మీ ఫీలింగ్స్, మైండ్ ఇటువంటి వాటిపై మీరు శ్రద్ధ పెట్టాలి. మీ పట్ల మీరు శ్రద్ధ తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండగలరు. దానితో మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ముందు దీనిని అనుసరించండి.

మన్నించడం నేర్చుకోండి:

కొన్ని కొన్ని సార్లు పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే.. వెంటనే మీ టెంపర్ లూజ్ అయిపోయి ఏదో ఒక మాటలు అనేస్తూ ఉంటారు. అది మంచి అలవాటు కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా మీరు క్షమించ గలగాలి.

మీ పిల్లల కోసం సమయాన్ని వెచ్చించండి:

ఇంట్లో ఏమైనా పనులు ఉన్నా లేదా ఆఫీస్ పనులు ఉన్నా సరే మీరు మీ సమయాన్ని మీ పిల్లలతో వెచ్చించడం చాలా ముఖ్యం. ఇలా మీరు మీ సమయాన్ని మీ పిల్లలతో వెచ్చిస్తే వాళ్లు కూడా మీతో అన్నీ పంచుకోవడం జరుగుతుంది.

వాళ్ళని వాళ్ళలాగే ఉంచండి:

వాళ్ళ ఇష్టాఇష్టాలని, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క గోల్స్ ని అలాగే ఉంచండి. ఏమైనా తప్పులు చేస్తే కాస్త చెప్పండి. అంతే కానీ వాళ్ళని పూర్తిగా మార్చవద్దు. వాళ్ళకి నచ్చిన వాటిల్లో వాళ్ళని వెళ్లనివ్వండి. అలా చేయడం వల్ల వాళ్ళు రాణించగలరు. అంతేకానీ మీరు వాళ్ళ డైరెక్షన్ ని మార్చేశారు అంటే వాళ్ళు సక్సెస్ అవడం కష్టం. ఇలా వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచి లక్షణం.

Read more RELATED
Recommended to you

Latest news