ఉపవాస పూజలకు ప్రత్యేకం.. సామల పులావ్‌!

-

శ్రావణమాసం.. అమ్మవారికి పూజలు, ఉపవాసాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తాం. దీనికి మరోపేరు వ్రత పులావ్‌ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రత్యేకంగా సామెలతో తయారు చేస్తారు. ఈ పులావ్‌ను ముఖ్యంగా పండుగల సమయంలో, ఉపవాసాలు ఉన్నపుడు తింటారు. అంటే ఆ సమయంలో కేవలం ఒకేపూట తింటారు పగటిపూట అప్పుడు దీన్ని తీసుకుంటారు. ఇందులో తక్కువ మసాలాలతో.. ఎక్కువ కూరగాయలు వేస్తారు. ముఖ్యంగా క్యారట్, గ్రీన్‌ పీస్, బంగాళదుంపలు వేసి తయారు చేస్తారు. ఇందులో కావాలంటే బీన్స్, ఇతర కూరగాయాలు వేసి కూడా రెడీ చేసుకోవచ్చు. దీంతో పులావ్‌ మరింత రుచికరంగా తయారవుతుంది. ఇందులో వేయించిన ఎండుకొబ్బరి పొడి, జీడిపప్పు లేదా వేరుశనగపప్పు వేస్తారు. దీన్ని పచ్చడి లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. దీనికి ఇంకా ఏ కర్రీస్‌ అవసరం ఉండదు. ఎక్కువ సమయం ఎనర్జీగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

sama-pulao

సామల పులావ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు…

1 కప్పు నానబెట్టిన సామల బియ్యం
టీ స్పూన్‌ జిలకర్ర
1/2 స్పూన్‌ మిరియాలు
కట్‌ చేసిన పచ్చిమిర్చి –2
క్యారట్‌
జీడిపప్పు–10
రెండు స్పూన్ల తురిమిన కొబ్బరి
కొత్తిమీరా తగినంత
11/2 నెయ్యి
ఇలాచీ–3
ఒక స్పూన్‌ తరిగిన అల్లం
1/2 బంగాళదుంప ముక్క
1/2 సైందవ లవణం
3 స్పూన్ల గ్రీన్‌ పీస్‌
1 స్పూన్‌ నిమ్మరసం.

తయారీ విధానం..

  • ముందుగా సామల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఓ బాండీ పెట్టి స్పూన్‌ నెయ్యి వేసుకోవాలి. జిలకర్ర, ఇలాచీ వేసి వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు క్యారట్స్, గ్రీన్‌ పీస్, బంగాళదుంప ముక్కలు, 2–3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన సామల రైస్‌ను వేయాలి. నీరు పూర్తిగా వంపిన తర్వాతనే వేయాలి. ఆ తర్వాత మిరియాలు, సైందవ లవణం వేయాలి. రెండు కప్పుల నీరు వేసి, అంతా కలిపి మూతపెట్టాలి. దీన్ని ఓ 12–15 నిమిషాలపాటు సిమ్‌లో ఉడికించాలి.
  • మరో ప్యాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి, కొబ్బరి పొడి, జీడిపప్పును రోస్ట్‌ చేయాలి.ఇప్పుడు దీన్ని సామల పులావ్‌కు జోడించి, పైన లెమన్‌ జ్యూస్‌ను వేసుకుని కలపాలి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే, సామల పులావ్‌ రెడీ.దీన్ని పెరుగు లేదా పచ్చడితో తింటే రుచికగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version