నెలకు రూ.50 వేల పెన్షన్ ని పొందాలని అనుకుంటున్నారా..? ఇవే మంచి స్కీమ్స్..!

-

చాలా మంది మంచి స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటూ వుంటారు. మంచి స్కీమ్స్ లో డబ్బులు పెడితే లాభం కూడా ఎక్కువే ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఎంతో కొంత చేతికి వస్తే బాగుంటుంది అని అంతా అనుకుంటుంటారు. అయితే రిటైర్ అయ్యాక నెలకు రూ. 50 వేల వరకు రాబడి ని ఇలా పొందవచ్చు. ఇక ఇప్పుడు నెలకు రూ. 50 వేల వరకు ఆదాయం రావాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. రిస్క్ కూడా ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో డబ్బులు పెడితే ప్రతీ నెలా కూడా మంచిగా డబ్బులు వస్తాయి.

నెలకు రూ. 50 వేల వరకు ఆదాయాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ తో పొందవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటోంది. 25 ఏళ్ల వయసు లో రోజుకు 250పైన పెట్టుబడి పెడితే నెలకు రూ. 57 వేల వరకు పెన్షన్‌ మీకు వస్తుంది. అలానే అన్- లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉంటాయి. టెన్యూర్ కాలం ముగిసిన తర్వాత ఆదాయంగా మీకు ఇస్తుంటారు.

ఈక్వీటీలు, డెట్ ఫండ్లలో పెట్టుబడిగా ఇన్సూరెన్స్ కంపెనీలు పెడతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. అంటే మీ పెట్టుబడిపై ఆదాయంతో పాటుగా జీవిత బీమా భద్రత ని మీరు పొందవచ్చు. ఎక్కువ ఆదాయం రావాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టచ్చు. కానీ రిస్క్ అయితే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news