ఐరన్ లేడీ సీతక్కకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

-

కాంగ్రెస్‌ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ.. అధికార పార్టీపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు సీతక్క. అయితే.. ఇవాళ ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

అటు లోకేష్‌ కూడా సీతక్కకు పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం. ప్రజలే సర్వస్వంగా భావించే మీరు నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు లోకేష్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version