ఉచిత ఆఫర్లతో జాగ్రత్త.. లేదంటే అకౌంట్ ఖాళీ…!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వుందా..? అయితే మీరు తప్పక దీనిని తెలుసుకోవాలి. ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువై పోయాయి. ఇలాంటి మోసాలు బారిన పడకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మోసపోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి సమయం నుండి కూడా ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఎక్కువై పోయాయి. దీనితో పాటుగా ఫ్రాడ్స్ కూడా ఎక్కువై పోయాయి.

 

అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయని అంది. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఒక విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. లేదంటే మోసపోవాల్సి ఉంటుంది. అలానే మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయం కావొచ్చు. ఆన్‌లైన్ మోసాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువవుతున్నాయని కస్టమర్లకు అలర్ట్ చేసింది.

మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అంది. ట్విట్టర్ వేదికగా తన కస్టమర్లను స్టేట్ బ్యాంక్ అలర్ట్ చేసింది. ఉచిత కూపన్లు, ఉచిత బహుమతులు, ఉచిత క్యాష్‌బ్యాక్, ఉచిత ప్రొడక్టులు వంటి మెసేజ్‌లు కనుక వస్తే వాటిని నమ్మొద్దు అని అంది. అలానే వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకొద్దు. అలానే లింక్స్ మీద కూడా క్లిక్ చెయ్యకండి అని బ్యాంక్ అంది. ఈ తప్పులు చేసారంటే బ్యాంక్ ఖాతా కాళీ అయ్యిపోతుంది జాగ్రత్తగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version