భగవద్గీతను అర్జునుడి కంటే ముందు ఎవరు విన్నారో మీకు తెలుసా?

-

మనలో చాలా మంది భగవద్గీతను కృష్ణు«డు కేవలం అర్జునుడికి మాత్రమే అది కూడా ఒక్కసారే బోధించాడని అనుకుంటాం. కానీ, గీతాబోధన చాలాసార్లు చెప్పుకున్నారు. పరమపవిత్రమైన గీత వల్ల ప్రయోజనాలను అర్జునుడి కంటే ముందు ఎవరు తీసుకున్నారు? కృష్ణుడు ఎప్పుడు బోధించాడు?
భగవద్గీతను ఎవరు బోధించారు? అనగానే కృష్ణుడు కురుక్షేత్రం సమయంలో అర్జునుడికి బోధించాడని చాలా ఈజీగా చెప్పేస్తారు. అయితే అర్జునుడి కంటే ముందుగా శ్రీ కృష్ణుడు గీతాబోధనలను కొంతమందికి చెప్పాడనే విషయం మీకు తెలుసా? ఈ సృష్టలో ప్రతిప్రశ్నకు భగవద్గీత ద్వారా సమధానం దొరుకుతుందని, వాటిని తప్పకుండా పాటిస్తే మానవాళి ఎటువంటి కష్టాలను అనుభవించరు.


పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్నపుడు ఈ విషయాల గురించి సూర్యుడికి ముందే తెలుసని చెప్పాడు. సూర్యుడిక ముందే ఎలా తెలుసని కృష్ణుడిని అడగ్గా, నాకంటే నీకంటే ముందు చాలా జన్మలు జరిగాయి ఆ జననాల గురించి నీకు తెలియదు. నాకు తెలుసని బదులిస్తాడు. ఈ విధంగా అర్జునిడి కంటే ముందు సూర్యుడు గీతబోధన పొందుతాడు.

  •  కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేవం చేశాడు. దీనిని సంజయుడు దృతరాష్ట్రుడికి ఇచ్చాడు. ఇతడికి వేదవ్యాసుడు దివ్యదృష్టిని ప్రసాదించాడు.
  • వేదవ్యాసుడు మహాభారతం రచించాలని సంకల్పించినపుడు ఆనతికాలంలో ఇది తన శిష్యులకు ఎలా నేర్పించాలి? అనుకుంటాడు. మహర్షి మనస్సు తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆయన వద్దకు వెళ్లి ఈ గ్రంధం కూర్పును సవివరంగా వివరిస్తాడు. ఈ భూమిపై మహాభారతాన్ని మీరే రాయాలని చెప్పాడు. అంతేకాకుండా దీనికి గణేషుని ఆవాహన చేసుకోవాలని తెలిపాడు. మహభారతం రాసే సమయంలోనే వేదవ్యాసుడు గణేషుడికి గీతోపదేశం చేశాడు.
  • ఆ విధంగా వేదవ్యాసుడు తన శిష్యులకు గీతోపదేశం చేస్తాడు. ముఖ్యమైన మహాభారత ఘట్టాలను నేర్పిస్తాడు. ఫలితంగా మహాభారతం ప్రాశస్యం సర్వజనులకు తెలిసింది.
  • ఉగ్రశ్రవ మహర్షి ఓ సారి నైమిషరణ్యానికి చేరుకుంటారు. ఆ దేశ రాజైన శైనికుడు 12 ఏళ్ల సత్సంగ్‌ను పాటిస్తున్నాడు. ఆ సమయంలో ఉగ్రశ్రవ్య మహర్షి శైనికుడిన మహాభారతం గ్రంథం గురించి చెప్పమని అడిగాడు.గతంలో వైషాంపయనుడి నోట విన్న శైనికుడు, మహర్షి కోరిక మేరకు ఆయనకు విన్నవించాడు. ఈ విధంగా గీత బోధన చేశాడు.
  • జనమేజయ రాజు తన తండ్రి పరీక్షిత్త మహారాజు మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సర్పయజ్ఞం చేశాడు. యాగం పూర్తయిన తర్వాత వ్యాసుడు తన శిష్యులతో సహా జనమేయరాజు అంతఃపురానికి వెళ్లాడు. అప్పుడు వ్యాసుడి ఆదేశం మేరకు వైషాంయపనుడు జనమేజయుడికి భగవద్గితను బోధంచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version