రెండిళ్ల పూజారి అవతారమెత్తిన నల్గొండ డీఈవో భిక్షపతి..!

-

ఈ మధ్య కాలంలో భార్య ఉండగానే ప్రియురాలును భార్యగా చేసుకునే ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్వరో వేరే వారు చేసుకున్నారంటే ఏమో.. అనుకుంటే పొరపాటే.  ఉన్నత ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఇలా పలుకుబడి ఉన్న వారే ఎక్కువగా ఇలా వ్యవహరించడం గమనార్హం. తాజాగా నల్గొండ డీఈవో బిక్షపతి కూడా ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డాడు. జిల్లా విద్యాధికారే ఇలా పాల్పడ్డాడంటూ పలువురు పేర్కొంటున్నారు.

DEo
DEO Bikshaopathi

బార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు భిక్షపతి. భార్యకు తెలియకుండా ప్రియురాలికి ముగ్గురు పిల్లల సంతానం. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది బార్య. గత కొంత కాలంగా కోర్టులో నడుస్తున్న భిక్షపతి దంపతుల వివాదం. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది భార్య. కొంత కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు డీఈవో భిక్షపతి. మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. తనకు లొంగకుంటే వేదింపులకు గురిచేసి సస్పెండ్ చేస్తారనేది భిక్షపతి పై ఉన్నతాధికారులకు పిర్యాదులు కూడా చేశారు. తనకున్న రాజకీయ పలుకుబడితో నల్గొండలో ఏళ్లుగా తిష్టవేశారు బిక్షపతి. భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version