హిందువులకి దీపావళి ఎంత పెద్ద పండగో చెప్పాల్సిన పనిలేదు. ఇల్లంతా దీపాలు వెలిగించి, జీవితంలోకి వెలుగులు తీసుకురావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు. పటాసులు కాల్చి చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. ఐతే ఈ పండగ తర్వాత భాయ్ దూజ్ అనే ప్రత్యేకమైన రోజు ఉంటుంది. దీపావళి మరుసటి రోజు జరుపుకునే ఈ పండగని ఉత్తరాది వారు జరుపుకుంటారు.
దక్ష్జిణాది వారికి పెద్దగా పరిచయం ఈ పండగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. భారత దేశం ఎంతో విభిన్నతని కలిగి ఉంది. ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు భారతదేశాన్ని ఆసక్తికరంగా మార్చివేసాయి. భాయ్ దూజ్ పండగ విషాయానికి వస్తే, ఇది అన్నాచెల్లెల, అక్కా తమ్ముళ్ల పండగ. ఈ రోజున అన్న చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు.. ఇద్దరూ ఒకరికొకరు బహుమతులు అందించుకుంటారు.
అన్నా చెల్లెళ్ళ బంధం మరింత గట్టి పడడానికి ఈ పండగ ఉపయోగపడుతుంది. అలాగే ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలుస్తుంది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న భాయ్ దూజ్ పండగ కొటేషన్లు..
మనం పంచుకునే అందమైన అనుబంధం మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని కోరుకుంతూ భాయ్ దూజ్ శుభాకాంక్షలు.
నీ భవిష్యత్తు బాగుండాలని, సంతోషంగా జీవించాలని భాయ్ దూజ్ పండగ రోజున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
నాకు హీరోలాంటి అన్న నువ్వుండగా సూపర్ హీరోల అవసరం ఏముంది.. భాయ్ దూన్ శుభాకాంక్షలు.
కాలం అన్నింటినీ మార్చవచ్చు. కానీ చిన్నప్పటి నుండి మన మధ్య ఉన్న అనుబంధాన్ని మాత్రం అదేమీ చేయలేదు. భాయ్ దూజ్ శుభాకాంక్షలు అన్నా..