భక్తి: మౌని అమావాస్య విశిష్టత, చెయ్యాల్సిన పనులు…!

-

ఈసారి మౌని అమావాస్య 2021, ఫిబ్రవరి 11వ తేదీన గురువారం అర్ధరాత్రి రోజున ప్రారంభమవుతుంది. అమావాస్య ఫిబ్రవరి 12వ తేదీ అర్థరాత్రి 12:35 గంటలకు ముగియబోతుంది. మౌని అమావాస్య నాడు ఎంతో శ్రద్ధగా పూజలు చెయ్యడం, భగవంతుడిని ఆరాధించడం చేస్తారు. ఈ పర్వదినాన్న హిందువులు వేకువ జామునే నిద్ర లేచి, గంగా నదిలో కానీ సమీపంలో ఉండే కొలను లాంటి వాటిలో కానీ స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వలన నీరు తేనేగా మారుతుందని చాలా మంది నమ్మకం.

ఇది పూర్తి అయ్యాక దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే ఉత్తర భారత దేశాల్లో వాళ్ళు అయితే దీనిని మాఘ అమావాస్య అని పిలుస్తారు. ఈరోజున రిషి జన్మించాడని చాలా మంది నమ్ముతారు. ఇలా వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు. మౌని అమావాస్య రోజున కలియుగం లో మౌనం ఉండటం వల్ల సత్య యుగంలో వేలాది సంవత్సరాలు కాఠిన్యం చేసే ధర్మం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది.

ఇక మౌని అమావాస్య నాడు ఎం చెయ్యాలి అనే విషయానికి వస్తే…. ఎవరి స్తొమత బట్టి వాళ్ళు పేదలకు దానం చేయడం మంచిది. నువ్వులను, నల్ల బట్టలు, దుప్పట్లు, నూనె లాంటివి చేస్తారు. అలానే మిగిలిన వస్తువులను కూడా దానం చేయొచ్చు. ఈ అమావాస్య నాడు విష్ణువుకు నువ్వులు, దీపాలు అర్పించడం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version