హీరోయిన్ భానుప్రియ కెరియర్ ను తొక్కేసింది ఎవరు..!!

-

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్  చాలా సాధారణమై పొయింది. ఇప్పుడు అవకాశాల కోసం అందమైన అమ్మాయిలకు వాల విసరడం కామన్ గా మారింది.. ఇది  చాలా కాలం నుండి  వస్తుంది. ఇందులో ఛాన్స్ ఇస్తామని  వాళ్ళు తమ అవసరాలు తీర్చుకుంటారు . ఇందులొ కొంత మంది అమ్మాయిలు తెలిసి మరీ వెళ్లిపోతున్నారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు  టైమ్ వచ్చినప్పుడు చెప్పి వాళ్ల పరువు తీస్తున్నారు.అయితే ఈ విషయం పై ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఆ విషయాలు సోషల్ మీడియా లో పెట్టి వారిని ఏకి పారేస్తున్నారు.

 

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా కాస్టింగ్ కౌచ్ పేరుతో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి కమిట్మెంట్ అడిగిన వారి పేర్లు అందరికి తెలిసే విధంగా టముకు వేసి చెబుతున్నారు. తెలుగులో శ్రీరెడ్డి, బాలీవుడ్ లో తనుశ్రి  లాంటివాళ్ళు వేదింపుల పై ధైర్యంగా బయటకి చెప్పారు. అయితే సీనియ‌ర్ హీరోయిన్‌  భానుప్రియ‌ కూడా కమిట్ మెంట్ బాధితురాలు అనే కథనం ప్రచారం లో వుంది..

 

దీనిపై తాజాగా సినీ జ‌ర్న‌లిస్టు  ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ  ఓ స్టార్ హీరో భానుప్రియ డ్యాన్సులు, న‌ట‌న‌లో తన‌ను క్రాస్ చేస్తుంద‌నే త‌న సినిమాల్లో ఆమె వద్దని చెప్పారని, తర్వాత ఆ స్టార్ హీరో తనకు బాగా ఇష్టం అయిన మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ లకే  ఎక్కువ ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇంకో కథనం  ప్రకారం ఆ స్టార్ హీరోతో పాటు మ‌రో బడా ప్రొడ్యుస‌ర్ ఇద్ద‌రూ క‌లిసి భానుప్రియ‌ను కమిట్ మెంట్ అడిగారని, దానికి  భానుప్రియ ఒప్పుకోలేదట . దీంతో వారు ఆమెకు ఛాన్సులు రాకుండా చేశారట. వాస్తవానికి భానుప్రియ‌కు అందంతో పాటు , నటన డ్యాన్సుల్లో టాలెంట్ వున్నా ఆమె  స్టార్ హీరోయిన్ కాకుండా తొక్కేసారని ప్రచారం వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news