భారత్ – పాక్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఎప్పుడూ లేదు. స్నేహ హస్తం చాచాలని భారత్ ప్రయత్నించినా పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. అలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. భారత్- పాక్ సరిహద్దుల్లో జరిగే అల్లర్ల గురించి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని జరుగుతున్న సమయంలోనూ భారత్ తన ఔదార్యాన్ని చాటుకుంది.
మన దేశం మీదుగా పాకిస్తాన్ ప్రధాని విమానం శ్రీలంక వెళ్ళేందుకు ఇండియా అనుమతి ఇచ్చింది. శ్రీలంక పర్యటనకు వెళ్తున్న పాక్ ప్రధాని, భారత గగనతలం మీదుగా వెళ్ళేందుకు అనుమతి కోరాడు. అందుకు ఒప్పుకున్న భారత్ ఆనుమతిని మంజూరు చేసింది. బాలాకోట్ దాడుల్లో మన విమానాలు వారి భూభాగానికి వెళ్ళాయని నానా రచ్చ చేసిన పాకిస్తాన్, ఇప్పుడు భారత్ ని పర్మిషన్ అడగడం విడ్డూరమే.