భారత్ బంద్ నేపథ్యం హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఐదు జోన్ లకు ముగ్గురు అడిషనల్ సీపీలు, ఇద్దరు జాయింట్ సీపీలను లు ఇంచార్జ్ లుగా నియమించారు. బంద్ నేపద్యంలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూడలని పోలుసులకు డీజీపీ సూచనలు చేశారు.
ఇక పాతబస్తీ లో స్వచ్ఛందంగా షాప్ లు మూసివేసి బంద్ కు వ్యాపారులు మద్దతు పలికారు. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్,జనసమితి, ఎంఐఎం పార్టీలు బంద్ కి మద్దతు తెలిపాయి. ప్రధాన కూడళ్లల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైపోగా MGBS బస్ స్టాండ్ నిర్మానుషంగా మారింది.