14 సంవత్సరాల వయసున్న భరత సుబ్రమణియం 73 వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆదివారం అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు కు చెందిన 14 ఏళ్ల బాల మేధావి తన మేథాశక్తి తో ఇంత గొప్ప టైటిల్ ను సొంతం చేసుకోవడవపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇటలీ లోజరిగిన వెర్గాని కప్ ఓపెన్ టోర్నీ లో భరత్ 6.5 పాయింట్లో తో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో భరత్ సుబ్రమణియం తన ఖాతాలో మూడో జీఎం నార్మ్ ఖాతాలో వేసుకోవడంతో.. పాఉ 2500 ఎల్లో రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రికార్డులతోనే.. తమిళనాడుకు చెందిన లిటిల్ మాస్టర్ కాస్తా భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడని ఆలిండియా చెస్ పెడరేషన్ ప్రకటన చేసింది. భరత్ సుబ్రమణియం ఈ ఘనత సాధించడంపై క్రీడా ప్రముఖులు, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కు శుభ కాంక్షలు చెప్పారు.