వివేకానంద రెడ్డి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్ యాదవ్. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ కు భరత్ యాదవ్ సమీప బంధువు. వివేకా హత్య కేసులో అనుమానితుల్లో భరత్ యాదవ్ కూడా ఒకరు. గతంలో పలుమార్లు భరత్ యాదవ్ ను విచారించింది సిబిఐ. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ని రిమాండ్ కు తరలించిన తర్వాత భరత్ యాదవ్ మీడియా ముందు నోరు విప్పారు.
వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు భరత్ యాదవ్. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని… ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ యాదవ్ నేరుగా భరత్ యాదవ్ తోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు చెప్పినట్లు భరత్ యాదవ్ తెలిపారు. వైయస్ వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీం కు ఆస్తి వెళుతుందని ఉద్దేశంతోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణ భయంతోనే గతంలో ఈ వివరాలు బయటికి చెప్పలేకపోయానని… తనకు ప్రాణ హాని ఉందంటూ భరత్ యాదవ్ వెల్లడించారు.