జనాభా దామాషా ప్రకారం సంపద పంచాలి. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నాము అని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని వర్గాల వారి సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా పూర్తి చేస్తాం అన్నారు భట్టి. ఇది మనం భారతదేశ చరిత్రలోనే గొప్పది. సంపద రాజకీయం విద్య అధికారం కొన్నిచోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉంది అని అన్నారు. ఇది అందరికీ సమానంగా పంచపడాలి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ జడ్చర్ల షాద్నగర్ కరీంనగర్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు అని భట్టి అన్నారు.
ఈ కుల గణన దేశవ్యాప్తంగా జరగాలని ముందుగా తెలంగాణ నుంచి ప్రారంభం కావాలని చెప్పారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి జనాభా దామాషా ప్రకారం సంపద పంచాలని నిర్ణయించాము అన్నారు భట్టి. సర్వే అయిపోయాక అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తాం అన్నారు. ఈ సర్వే సర్వరోగ నివారిలా ఉంటుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నాం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.