చాలా మందికి సోలోగా ట్రిప్ వేయడం అంటే ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. రోజూ వివిధ రకాల పనులతో బిజీగా ఉండే వాళ్ళు చక్కగా ఒక ట్రిప్ సోలోగా వేస్తే ఆ బాధల నుండి రిలీఫ్ గా ఉంటుంది. పైగా ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు కూడా ఏదైనా ట్రిప్ సోలోగా వేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్లేసెస్ బెస్ట్ మరి ఆ ప్రదేశాల గురించి ఇప్పుడే చూసేద్దాం.
రిషికేష్
హాయిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఇక్కడకి వెళ్లండి. యోగ రాజధానిగా ఉన్న రిషికేష్ ఆధ్యాత్మికతను బయటకు తీసుకువస్తుంది.
మనాలి
మనాలి చూడడానికి చాలా బాగుంటుంది పైగా అక్కడ మంచు, ప్రకృతి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఎవరికైనా మనాలి నచ్చుతుంది.
ఉదయపూర్
ఇక్కడ కోటలు రాజభవనాలు ఆలయాలు వంటివి ఉంటాయి. సోలోగా వెళ్లాలి అనుకుంటే మీరు ఇక్కడకి కూడా వెళ్లొచ్చు.
అల్లెపి
ఇది కూడా చాలా బాగుంటుంది ఎంతో అందమైన కాలువలు, బ్యాక్ వాటర్ ఇవన్నీ కూడా అందరికీ నచ్చస్తాయి ఒంటరిగా మీరు వెళ్లాలనుకుంటే ఈ ప్లేస్ కూడా బాగుంటుంది.
పాండిచ్చేరి
అందమైన బీచ్ లతో చాలా అద్భుతంగా ఉంటుంది పాండిచ్చేరి. ఒంటరిగా ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. కాబట్టి ఎంతో ఆనందంగా మీరు ఉండొచ్చు. సరదాగా ఉంటుంది.
ధర్మశాల
ఒంటరిగా వెళ్లాలనుకునే వాళ్ళు ధర్మశాల కూడా వెళ్ళచ్చు. టిబెట్ సంస్కృతి బాగా ఆకట్టుకుంటుంది పైగా ఈ ప్రదేశం అందరికీ నచ్చుతుంది కూడా. చాలామంది ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు.
శ్రీనగర్
శ్రీనగర్ కూడా మీరు ఒంటరిగా వెళ్లొచ్చు సోలో ట్రిప్ వేయాలనుకుంటే ఇది కూడా బెస్ట్ ప్లేస్.