కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. వడ్డీ లేని రుణాలు ఇస్తాం : భట్టి

-

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వడ్డీలేని రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయలేదని, గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గమనించిన రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఓకే సరి 2 లక్షలు రుణ మాఫీ చేస్తామన్నారన్నారు.

గిట్టుబాటు ధర ఇచ్చి పెట్టుబడి కి 15 వేలు ఎకరనికి అందించడం జరుగుతుందని, భూమి లేని రైతులకు అండగా ఊంటామన్నారు. ధరలు పెంచి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం, అసలు భూమి లేని వారికి ఉపాధి హామీ పథకం లో నమోదు చేసుకున్న వారి అకౌంట్ లో 12 సంవత్సరం కి వేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేశారు,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత క్విట ధాన్యం కి 2500 ఇస్తాం,ఇతర పంటలకు మద్దతు ధర ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version