కాంగ్రెస్‌ను చూసి బిఆర్ఎస్ నాయకులు ఆగమాగం అవుతున్నారు : భట్టి

-

తెలంగాణ ఎన్నికల వేళ తమ పార్టీ ఆరు గ్యారంటీ కార్డులు ఇచ్చిందని, వాటిని అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపదను , వనరులను కాపాడాలని కాంగ్రెస్ భావిస్తుందని కానీ…. వాటిని దోచుకోవాలని బిఆర్ఎస్ భావిస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావించే వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ద్వారా ధర్మం గెలవబోతోందన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ గెలుపు ప్రజలు గెలుపని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 74 నుంచి 78 సీట్లు వస్తాయని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అధికారం వచ్చిన మొదటి వంద రోజుల లోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా పెట్టుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.

గ్యారంటీ కార్డు ఉంటే అన్ని పథకాలు లభిస్తాయన్నారు భట్టి విక్రమార్క. ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. ప్రతి మండలంలో 15 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారు. స్కూల్ కు వచ్చే పిల్లలకు  బస్సుల సౌకర్యం కలిపిస్తామన్నారు. తెలంగాణలో సంపద ఉంది కాబట్టి అమలు చేస్తామని…. తెలంగాణ సంపదను దోచుకోకుండా ప్రజల సంక్షేమం కోసం పంచుతామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ లాగా మాయ మాటల స్కీంలు ప్రకటించడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ను చూసి బిఆర్ఎస్ నాయకులు
ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ అక్రమంగా అమ్మిన భూములపై చట్టపరంగా చర్యలు తీసుకోని ప్రజలకు పంచుతామన్నారు. కార్యకర్తలు రోడ్డు మీదనే ఉండాలని.. చీమ చిటుక్కు మన్నా..ని కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version