ధరణి నీ మారుస్తాం.. అప్ గ్రేడ్ చేస్తాం : భట్టి

-

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో టీకాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. టి.కాంగ్రెస్‌ ప్రతిపాదనలను తిరస్కరించిన ఖర్గే తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని..ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలని ఖర్గే టీకాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామని, మేం నాలుగు వెలు పెన్షన్ ఇస్తాం అంటే, ముఖ్యమంత్రి పెంచుతాం అన్నారన్నారు.

 

ఇది కాంగ్రెస్ విజయమని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదిన్నర ఏళ్ల నుంచి సీఎం ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. సూర్యాపేట వరకు పారే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాదని, ఎస్ఆర్ఎస్పీ, మానేరు, కాకతీయ కెనాల్ కట్టింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో కట్టిన ప్రాజెక్టుల్లో నీళ్లను చూపించి, నా నీళ్ళే అని సీఎం కేసీఆర్‌ సంకలు గుద్దకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ధరణి ప్రభుత్వానికి చేతిలో ఉన్న భూ కుంభకోణానికి దారి తీసే అతిపెద్ద సాఫ్టు వేర్ అని, కాంగ్రెస్ హయంలో మేము భూములు పంచితే.. ఇపుడు వెనక్కి తీసుకునే కార్యక్రమం చేపట్టారని ఆయన ధ్వజమెత్తారు.

ధరణి ఓ మహమ్మారి.. భూ కుంభకొణానికి దారి తీసిందని, పేదలకు చెందాల్సిన భూములు చెందకుండా పోతున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి నీ మారుస్తాం.. అప్ గ్రేడ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నో రకాల భూములను, ధరణి ద్వారా ఎన్నో భూ కుంభ కోణాలు చేశారన్నారు. మేం ధరణి గురించి మాట్లాడితే కేసీఆర్ భయపడుతున్నారని, ధరణి గురించి కాంగ్రెస్ స్లోగన్లు చూసి, భయపడుతున్నారన్నారు. సీడబ్ల్యూసీ లో అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ నుంచి ఇద్దరికీ ఇచ్చారు వాళ్ళకు అభినందనలు తెలిపారు భట్టి. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే తో ఇవాళ సమావేశం అయ్యామని, రాష్ట్ర రాజకీయాలు, 26 న జరిగే చేవెళ్ల బహిరంగ సభ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై చర్చ జరిగిందన్నారు భట్టి విక్రమార్క. బలహీన, వర్గాలు, ఎస్టీ ఎస్సీల కోసం మెరుగైన కార్యక్రమాలే కాంగ్రెస్ ఇప్పటి వరకు తీసుకుందని, రాష్ట్రం ఏర్పడ్డాక వనరులు, సంపద పెరిగాక కూడా ప్రజలకు పంచడం లేదన్నారు. ఇంకా మెరుగైన పథకాలు, సబ్ ప్లాన్ అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version