తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు : కిషన్‌ రెడ్డి

-

బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించిందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. ఆదివారం కూకట్ పల్లిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనలో రూపాయి అవినీతి కూడా జరగలేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ ఒక్కరోజు సెలవు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వాల హాయంలో దేశంలో తీవ్రవాద దాడులు జరిగేవని.. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో ఎలాంటి ఉగ్రవాద చర్యలు లేవని అన్నారు.అనంతరం సీఎం కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు.

తెలంగాణను సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భూమి కనిపిస్తే చాలు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. తెలంగాణలో ఎవరైనా సరే వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటా ఇవ్వాలన్నారు. కేసీఆర్ పాలన 30 శాతం వాటాల సర్కార్‌గా మారిపోయిందని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరం బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిపోయిందని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version