స్వచ్ఛంద ప్రజాసేవ చేసే వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని చెప్పారు. మంగళవారం స్థానిక శ్రీనిధి రెసిడెంట్స్ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి స్పిరిచువల్ స్పీచ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు.
రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సద్గురు మధుసూదన్ సాయి ట్రస్ట్ వాళ్ళు ప్రారంభించనున్నారని దానికి యాభై శతం నిధులు ట్రస్ట్ సమకూరుస్తుందని మిగతా 50% నిధులు తెలంగాణ ప్రభుత్వం భరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది బాలలకి పౌష్టికాహారం అందుతుందని అన్నారు.