పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ వాయిద్య కారుడు కిన్నెర మొగిలయ్యకు రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ద్వారా ఈ సాయాన్ని రిలీజ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో అఖరితరం కళాకారుడు.
అంతేకాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగులయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా.. ప్రభుత్వం ఎనిమిదో తరగతి లో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. ఈ గుర్తింపుతో మొగులయ్య మనసైతే సంతోసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛన్ కోసం ఏడాది కిందట దరఖాస్తుచేసుకున్నా మంజూరు కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ భ్లీమ్లా నాయక్ చిత్రం లో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్ గా మారిపోయారు కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయనను ఇంటర్వూ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన ఆర్థిక స్తోమత గురించి చెప్పుకున్నాడు. దీంతో ముందుకొచ్చిన పవన్.. మొగిలయ్యకు రూ. 2 లక్షల సాయం అందించారు.