హత్రాస్ ఘటన: కుటుంబీకులకు వై సెక్యూరిటీ అడుగుతున్న ఆజాద్.

-

చంద్రశేఖర్ ఆజాద్, హత్రాస్ బాధితురాలికుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆజాద్ మాట్లాడుతూ, బాధితురాలి కుటుంబానికి వై సెక్యూరిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసాడు. మీరు వై సెక్యూరీటీ డిమాండ్ చేస్తారా లేదా వాళ్ళని నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్ళాలా అని ప్రశ్నించాడు. ఇంకా ఈ విషయమై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కోరాడు.

ఆజాద్ డిమాండ్ కంటే ముందుగానే కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హత్రాస్ బాధితురాలి కుంటుంబాన్ని కలుసుకుని, కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ కలిగించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అంటూ గుర్తు చేసాడు. ఇంకా మాట్లాడుతూ, కంగనా రనౌత్ కి వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వస్తుంది గానీ బాధితురాలి కుటుంబ సభ్యులకి మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ప్రభుత్వంలో నుండి దిగిపోవాలని రాజీనామా చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news