ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. ఈ నెల 25 వ తేదీన భీమ్లా నాయ‌క్ సినిమా ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో సంక్రాంతి కానుక‌గా భీమ్లా నాయ‌క్ సినిమాను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం అనుకుంది. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి, థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల వాయిదా వేశారు.

తాజా గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు. మంగ‌ళ వారం రాత్రి భీమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. కాగ భీమ్లా నాయ‌క్ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు రానా క‌లిసి న‌టిస్తున్నారు. అలాగే నిత్య మీన‌న్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగ అయ్యాప్ప‌న్ కోశియ‌మ్ అనే మ‌ల‌యాళ హిట్ సినిమాను తెలుగు లో భీమ్లా నాయ‌క్ గా తెరకెక్కిస్తున్నారు. సాగ‌ర్ చంద్ర డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హిరిస్తున్నాడు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్నాడు. కాగ ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన పాటలు, టీజ‌ర్.. సినిమా అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news