డైట్‌లో ఎక్కువగా తేనె తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి

-

డైట్ లో ఉన్నవాళ్లు, షుగర్ తినటం ఇష్టం లేని వాళ్లు, షుగర్ పేషెంట్స్ ఇలా చాలా మంది..పంచదారకు బదులుగా తేనెను వాడుతుంటారు. తేనె చర్మానికి, జుట్టుకు, శరీర ఆరోగ్యానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ తేనె నిజంగా ఆరోగ్యానికే మంచిదేనా..తినే వేసుకుని తాగితే..బరువు తగ్గొచ్చా, షుగర్ పేషెంట్స్ అసలు తేనె తీసుకోవచ్చా..ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం..

బరువు పెరగడం రోజూ ఒక టీస్పూన్ తేనె తీసుకుంటే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. ఐతే అది నిజం కాదు. తేనె చక్కెర కంటే తక్కువ తీపిని కలిగి ఉన్నప్పటికీ, బరువును పెంచడం మాత్రం ఖాయం. మీరు ఎలాంటి ఇతర డైట్, వ్యాయామాలు చేయకుండా కేవలం తేనె తీసుకోవటం వల్ల బరువు తగ్గుతారు అనుకోవడం మీ అపోహ మాత్రమే.

రక్తంలో చక్కెర తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. ఐతే నిపుణుల అభిప్రాయం ప్రకారం. తేనెను అధికంగా తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అందుకని తేనెను పరిమితంగానే షుగర్ పేషెంట్స్ తీసుకోవాలి.

తేనెను పదేపదే తినడం వల్ల, తీపి కారణంగా నోటిలో బ్యాక్టీరియా సమస్య ప్రారంభమౌతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది.

జీర్ణక్రియ తేనెను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూలా ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. తేనెను అధికంగా తింటే డయేరియా కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

రక్తపోటు సమస్యలున్నవారు తేనె తినడం మంచిది కాదు. తేనెలోని తీపి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం.

ఇలా తేనె వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి తేనెను అదేపనిగా మీ డైట్ లో భాగం చేసుకోవడం అంత మంచిది కాదు..షుగర్ పేషెంట్స్ తేనెకు బదులుగా స్టీవియా ఆకును ఉపయోగించవచ్చు. ఇది సహజమైన తీపిని కలిగి ఉంటుంది. అందులోనూ దీనివల్ల ఆరోగ్యానికి కానీ, షుగర్ లెవల్స్ పెరుగుదల లాంటి సమస్యలు కూడా రావు. తేనే ఎప్పుడూ పంచదారకు 100శాతం ప్రత్యామ్మయాయం అని మాత్రం అనుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news