భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ తో..!

-

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న తర్వాత నటిస్తున్న సినిమా భోళా శంకర్.. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాలం కి గా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది.

అయితే ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది భోళాశంకర్ చిత్ర బృందం..ఈ సినిమాను ఆగస్టు 11 2023న విడుదల చేస్తున్నట్లు మేకర్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుండీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో కీర్తి సురేష్ రాజసం ఉట్టిపడుతోందనే చెప్పాలి. మరొకవైపు చిరంజీవి, తమన్నా కూడా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు.

ఇకపోతే భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానులకు ఊరట కలిగించారు. ఏజెంట్ సినిమా స్థానంలో ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండగా..ఈ వాయిదా పడుతున్న నేపథ్యంలో ముందుగా అఖిల్ ఏజెంట్ సినిమాను రిలీజ్ చేసి.. ఆ తర్వాత భోళా శంకర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి చిరంజీవికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version