ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షసులు భయపడేలా పాలన ఉందని , హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని భూమా అఖిలప్రియ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు… ఎంపీలకు,ఎమ్మెల్యేలకు పని లేదని భూమా అఖిలప్రియ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని ఆరోపించారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
అన్ని లెక్క రాసుకుంటున్నాం.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. తాను, తన భర్త జైలులో ఉన్నప్పుడు తన కొడుకుని చూడడానికి జడ్జి రోజుకు ఒక గంట సమయం ఇచ్చారు.. జైలులో ఉండగా తన కుమారుడి ఏడుపు ఇప్పటికి గుర్తుందని అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. అవన్నీ గుర్తున్నాయి… టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే లెక్కలు తేలుస్తామన్నారు. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ పతనం మొదలవుతుందని అఖిలప్రియ అన్నారు . ఆళ్లగడ్డలో తాగడానికి నీళ్లు లేకుంటే చెరువుకు నీళ్లు వదులుకొని ఎమ్మెల్యే తల్లి అందులో చేపలు పడుతుందట అని అన్నారు .వైసీపీ ప్రభుత్వం కేసి కెనాల్ కు నీళ్లు వదలలేదని అఖిలప్రియ అసహనం వ్యక్తం చేసింది.