రాష్ట్రంలో 3 వేల షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి అని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చాలా పారదర్శకంగా మద్యం షాపుల అలాట్మెంట్ జరిగింది. గతంలో పనికి రాని చెత్త బ్రాండ్లు ఉండేవి. మార్జిన్ పెంచడం వల్ల బాటిల్ పై పది రూపాయలు పెంచడం జరిగింది. కానీ ప్రభుత్వం పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఇక కల్లు గీత కార్మికులు కు పది శాతం షాపుల ను కేటాయించాము. కల్లు గీత కార్మికుల విషయంలో కోర్ట్ కు వెళ్లినా బలంగా వాదించాము అని మంత్రి అన్నారు.
అలాగే ప్రజాలకు కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. పెరిగిన చార్జీలు కేవలం. 1 శాతం.. అంటే పది రూపాయలు. ప్రజలు వైసీపీ చేసిన పనులు ఇంకా మర్చిపోలేదు. గతంలో వైసీపీ సిండికేట్లను ఏర్పాటు చేసింది. అసలు వైసీపీ తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టింది. ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తే.. చూస్తూ ఊరుకొము అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.